Header Banner

శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం..! అమరావతి పరిధిలో శ్రీనివాస కల్యాణం!

  Thu Feb 27, 2025 14:15        Devotional

అమరావతి కేంద్రంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో మార్చి 14న శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న టిటిడి శ్రీవేంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణా న్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీటీడీ మార్చి నెలలో తిరుమల నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. అమరావతి కేంద్రంగా ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీ శ్రీనివాస కల్యాణం నిర్వహణకు నిర్ణయించింది. మార్చి 14న వెంకటపాలెం లో ఉన్న టీటీడీ శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈ కల్యాణం కు ముహూర్తంగా నిర్ణయం తీసుకున్నారు.


ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


శ్రీనివాస కల్యాణం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చా రు.రెండు వారాలు గడువు ఉండడంతో టిటిడి అధికారులు క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పనులు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కల్యాణం తిలకించేందుకు సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు.. ప్రజా ప్రతినిధులు.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ప్రత్యేక ఏర్పాట్లు వెంకటపాలెం ఆలయం వద్ద అవసరమైన భద్రత, భక్తులకు క్యూలైన్లు, కల్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాలలో విసృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వ యం చేసుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులు సూచించారు.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


కళా బృందాలు, ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా హాజరయ్యే భక్తుల కోసం అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక..మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది. మే నెలలో ఉత్సవాలు ⁠మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర, ⁠9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభించనున్నారు. ⁠10న మతత్రయ ఏకాదశి, ⁠13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, ⁠14న కుమారధారతీర్థ ముక్కోటి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ⁠25న సర్వ ఏకాదశి.. ⁠26న అన్నమాచార్య వర్థంతి నిర్వహించాలని నిర్ణయించారు. అదే విధంగా ⁠28న మాస శివరాత్రి, ⁠29న సర్వ అమావాస్య నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక..⁠30న శ్రీ విశ్వావ సునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!



ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ttd #thirupathi #thirumala #todaynews #flashnews #latestnews